జన్వాడా ఫాం హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ టీ ఎల్ పరిదిలో ఉన్న కట్టడాలపై, అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఘుళిపిస్తున్న నేపథ్యంలో.. జన్వాడా ఫాం హౌస్ కూల్చే అవకాశం ఉందని హైకోర్టులో ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. ఫాం హౌస్ కూల్చకుండా స్టే ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమీషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్ పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను చేర్చారు.
111 జీవో ను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన జన్వాడ ఫామ్ హౌస్ ను సైతం కూల్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఫామ్ హౌస్ పై అందిన ఫిర్యాదులపై ఆయా ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం ఏ ఏ శాఖల నుంచి అనుమతులు ఇచ్చారనే కోణంలో హైడ్రా అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని గతంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. డ్రోన్ కెమెరాతో ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలను చిత్రీకరించడంతో రేవంత్ పై కేసు పెట్టి జైలుకు పంపించారు. ఇప్పడు ఖచ్చితంగా ఈ ఫాం హౌస్ ను కూలుస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.