తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఆ పార్టీకి 40 లక్షల సభ్యత్వాలు నమోదు అయ్యాయి. కేంద్రంలలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం… తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడం ద్వారా పార్టీ అధిష్టానం తెలంగాణపై మరింత ఫోకస్ చేస్తుంది. 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని కేడర్ కు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తుంది. క్షేత్ర స్థాయిలో మరింత బలపడేందుకు ప్రయత్నాలు చేస్తంది. ఇందులో భాగంగానే పార్టీ కమిటీల నియామకం జరుగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం అయిందని బేజేపీ విమర్శలు చేస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గ్రామ పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని.. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే గ్రామపంచాయితీలకు వస్తున్నాయని అంటున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ గ్రమపంచాయితీలను అప్పుల కుప్పలుగా మార్చిందని.. నిధులు విడుదల చేయకుండా సర్పంచుల ఆత్మహత్యలకు కారణం అయిందని అంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కూడా గ్రామ పంచాయితీలను పట్టించుకోవడం లేదని.. బీజేపీ నేతలు బీజేపీ ఫైర్ అవుతోంది.
ఇప్పటికే బీజేపీ బూత్ స్థాయి కమిటీల నియామకం దాదాపు పూర్తి కావచ్చింది. ఇక మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీల నియామకం కావలసి ఉంది. అయితే మండల, జిల్లా అధ్యక్షుల విషయంలో ఎవరికి వారు తమ అనుచరుల కోసం లాబీయింగ్ చేస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో కొందరు నాయకులు ఎవరికి వారు తమ వారికి పదవులు ఇవ్వాలని పావులు కదుపుతున్నారట. ఇక్కడే అసలు సమస్య వచ్చిందని పార్టీలో టాక్ నడుస్తుంది. యేళ్ల తరబడి పార్టీని నమ్ముకొని ఉన్నవారు, పార్టీకోసం కష్టపడ్డవారిని కాదని ఇతరులకు పదవులేంటని మండి పడుతున్నారు. రాబోయేరోజుల్లో పార్టీ మరింత పటిష్టం కావాలన్నా.. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా.. పార్టీకోసం పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.
ఇప్పటికే కమిటీల అధ్యక్షుల నియామకం విషయంలో అధిష్టానానికి రికమండేషన్లు వెళ్తున్నాయట. ఎవరికి వారు తమ తమ అనునాయులకు పదవులు ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారట. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం రికమండుషన్లకు ససేమిరా అంటున్నారని సమాచారం. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ పదవుల విషయంలో నో రికమమండేషన్ అని నేతలతో కరాఖండిగా చెబుతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది