నిన్న మొన్నటి వరకు టమాటా (Tomato) ధరలు సామాన్యులకు చుక్కలను చూపించాయి. టమాటా రెట్లతో సామాన్యులతో పాటు మద్యతరగతి ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని వారాల పాటు చాలా మంది ఇళ్లలో టమాటా తమ వంటలలో కనిపించకుండా పోయింది. అయుతే దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టి, ప్రభుత్వం తరపున తక్కువ ధరలలో టమాటా ధరలను (Tomato Price) నియంత్రించింది. దీనివల్ల ఇప్పుడయితే టమాటా ధరలు అదుపులో ఉన్నాయి.
ఇప్పుడు ఉల్లిగడ్డను (Onion) కొనకుండానే కంటనీరు తెప్పిస్తుంది. దేశంలో చాలా నగరాల్లో రూ. 60 పైగా విక్రయిస్తున్నారు. అయితే ఈ ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ద్రవ్యోల్బణం (Inflation) తగ్గడానికి బదులుగా పెరుగుతోంది. ఉల్లిగడ్డ ధర (Onion Price) రోజు రోజుకు పెరుగుతుండడం వల్ల అటు సామాన్య ప్రజలతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. నెల రోజుల క్రితం బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి 20 వరకు లభించే కిలో ఉల్లిగడ్డ ఇప్పుడు కిలో రూ.35 నుంచి 40 వరకు విక్రయిస్తున్నారు. టమాటా రేటు తగ్గింది అనుకునే లోపే ఉల్లిగడ్డ రేటు అమాంతంగా పెరుగుతుండడం వల్ల సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి.పెరుగుతున్న ఉల్లిగడ్డ ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఉల్లిగడ్డ ఎగుమతులపై 40 శాతం దిగుమతి సుంకం విధించింది. ఈ టాక్స్ ద్వారా దేశంలో ఉల్లిగడ్డ నిల్వలను పెంచవచ్చనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.