భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకులం అయిన నేపథ్యంలో యశోద గ్రూప్ హాస్పిటల్స్ స్పందించింది. వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం చెక్కును బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు ఆస్పత్రి ఆపరేటర్స్ చీఫ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఆపద కాలంలో దాతృత్వాన్ని చాటుకున్న యశోద హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ రావు, డైరెక్టర్లు సురేందర్రావు, దేవేందర్ రావులను డిప్యూటీ సీఎం అభినందించారు.