Menu

  • Home
  • తెలంగాణ
  • Cyber Crime: తెలంగాణ ఎమ్మెల్యేకు ‘న్యూడ్ కాల్’
Image

Cyber Crime: తెలంగాణ ఎమ్మెల్యేకు ‘న్యూడ్ కాల్’

సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇన్నిరోజుల‌ను సాధారణ ప్ర‌జ‌ల‌ను టార్గెట్ చేసుకొని డ‌బ్బులు గుంజేవారు. ఇప్పుడు సైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ పంథా మార్చారు. ఇప్పుడు ఏకంగా రాజ‌కీయ నాయ‌కుల‌నే టార్గెట్ చేసుకున్న‌ట్లున్నారు. తాజాగా న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు.

mla

ఎమ్మెల్యే వేముల వీరేశం త‌మ అనుచ‌రుల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో సైబ‌ర్ కేటుగాళ్లు ఆయ‌న‌కు వీడియో కాల్ చేశారు. కాల్ ఆన్స‌ర్ చేయ‌గానే ఓ అమ్మాయి బ‌ట్ట‌లు లేకుండా న్యూడ్ గా క‌నిపించింది. వెంట‌నే ఆయ‌న కాల్ క‌ట్ చేశారు. అప్ప‌టికే విడియోను రికార్డు చేశారు. ఆ వీడియో క్లిప్ ను ఎమ్మెల్యేకు పంపించి డబ్బులు డిమాండ్ చేశారు. వారికి డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ విడియోను కాంగ్రెస్ పార్టీ కార్య‌కర్త‌ల‌కు, ఎమ్మెల్యే అనుచ‌రుల‌కు సైబ‌ర్ నేర‌గాళ్లు పంపించారు. కార్య‌కర్త‌లు ఈ విష‌యాన్ని ఎమ్మెల్యేకు తెలిపారు. వెంట‌నే ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Share the post