తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఈనెల 3వ తేదీ 10 వరకు నామినేషన్లకు ఎన్నికల కమీషన్ అవకాశం కల్పించింది. ఈనెల తొమ్మది వరకు, అంటే నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న119 నియోజక వర్గాల్లో 2,474 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే చివరి రోజు నామినేషన్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దాఖలు అయిన నామినేషన్ల స్క్రుటినీ ఈ నెల 13న ఉంటుంది. అదేవిధంగా ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల లిస్ట్ ప్రకటిస్తారు.