Menu

  • Home
  • జాతీయం
  • Pension: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ కట్.. హిమాచల్ ప్రభుత్వం సంచలనం
Image

Pension: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ కట్.. హిమాచల్ ప్రభుత్వం సంచలనం

హిమచల్ ప్రదేశ్ శాసనసభలో సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు సవరణ బిల్లు-2024ను ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పెన్షన్ లభించదని స్పష్టంగా పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పార్టీ మార్పులపై కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇకపై పెన్షన్ సదుపాయం ఉండదని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ నిబంధన ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ బుధవారంనాడు చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతిని ప్రోత్సహించే వారిని కట్టిడి చేసేందుకు మరియు ప్రజాస్వామ్యాన్ని బలపర్చడం కోసం ఈ బిల్లు అవసరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Share the post

Also Read..