కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఇటీవల రోడ్డుప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి, సాయన్న కూతురు గైని నివేదిత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు.