సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరణ కానుంది. విగ్రహం నమూనా చూస్తే బంగారు రంగు అంచు రంగుతో కూడిన ఆకుపచ్చ చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటన బొట్టుతో తెలంగాణ తల్లి రూపం కనిపిస్తుంది. ఎడమచేతిలో మొక్కజొన్న కంకి, వరి గొలుసు, సజ్జ కంకి ఉన్నాయి. చేతికి మట్టి గాజులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిళ్లతో రూపుదిద్దారు. తెలంగాణ సగటు మహిళ ఉండే విధంగా విగ్రహాన్ని ప్రొ. గంగాధర్ ఈ విగ్రహాన్ని రూప కల్పన చేశారు. ప్రముఖ విగ్రహ రూప శిల్పి రమాణారెడ్డి టీమ్ కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు, దిమ్మె 3 అడుగుల ఎత్తులో ఉంది.
