విద్యార్థులకు అందవలసిన పుస్తకాలు స్క్రాప్ దుకాణానికి చేరాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఓ పాత సామాన్ల దుకాణంలో గత సంవత్సరం పుస్తకాలు కట్టలు కట్టలుగా ఉండడం కొందరు స్థానికులు గమనించారు. 6 నుండి 10వ తరగతి వరకు గల ఇంగ్లీష్ మీడియం పుస్తకాల 45 కట్టలు ఉన్నాయి. వాటికి సీలు కూడా తీయకుంగా ఉన్నాయని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పుస్తకాలు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లాల్సిన పుస్తకాలని తెలుస్తోంది. జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారి శంకర్ ఈ పుస్తకాలను షాపులో తమకు విక్రయించాడని షాపు నిర్వాహకుడు వివరించాడు. దీనిపై అధికారులు విచారణ చేసి కలెక్టర్ కు నివేదికి పంపుతామని అంటున్నారు.