Wednesday, June 18, 2025
HomeNewsTelanganaNew Ration Cards: కొత్త రేషన్ కార్డులకు 'మీసేవ'లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే..

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే..

కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వం ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారుల నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీసేవా ద్వారా అప్లై చేయొచ్చు.

అభయహస్తం పేరుతో మొత్తం 5 గ్యారెంటీలకు దాదాపు కోటి పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే ఉన్నారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో స్క్రూటినీ చేయడం త్వరగా అయ్యే పనికాదు. దీనివల్లే రేషన్ కార్డుల కోసం అధికారికంగా మీసేవా ద్వారా అప్లికేషన్లను స్వీకరించాలని డిసైడ్ చేశారు. కొత్త రేషన్ కార్డులతో(New Ration Cards) పాటు రేషన్ కార్డుల్లో పేరు లేని వారు కూడా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సర్కారు చెబుతోంది.ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన అభయహస్తం అప్లికేషన్స్ లో రేషను కార్డు, ధరణి తదితరాల కోసం అదనంగా మరో 19,92,747 అప్లికేషన్లు వచ్చాయి. రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NIC) ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డు అత్యంత ఉపయోగకరమైనది కావడంతో ఈప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఓవైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు అభివృద్ది కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి.

బోగస్ రేషన్ కార్డులను తొలగించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాలని స్పష్టం. ఈ ప్రక్రియ గత 5 నెలలుగా కొనసాగుతోంది. అయితే రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోవడానికి జనవరి 31 తుది గడువుగా ఉంది. అలోపు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డు ఈ కేవైసీని సింపుల్ గా చేసుకోవచ్చని చెబుతున్నారు. రేషన్ డీలర్లకు వద్దకు వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి.. ఆ తర్వాత వేలిముద్రలు నమోదు చేస్తే ఈకేవైసీ పూర్తవుతుందని వివరిస్తున్నారు. రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోకుంటే వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని స్పష్టం చేస్తున్నారు. జనవరి 31వ తేదీ లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు లింక్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ సూచించారు. భారత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా రేషన్ బియ్యం, ఇతర సరకులు అందిస్తున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments