తెలంగాణ ప‌ర్యాట‌క రంగానికి నూత‌న జ‌వ‌స‌త్వాలు : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

తెలంగాణ పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు సంతరించేలా ప‌ర్యాట‌క శాఖ వినూత్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతోంది. ప్ర‌పంచ ప‌ర్యాట‌క ముఖ చిత్రంలో తెలంగాణ కీల‌క స్థానంలో ఉండాల‌నే సీఎం రేవంత్ రెడ్డి అకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప‌ర్యాట‌క రంగ అభివృద్ధి, బ్రాండింగ్, ప్ర‌మోష‌న్ వంటి అంశాల‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తగు ప్రాచుర్యo కల్పించి ప్రోత్సహించేందుకు ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్ర‌త్యేక చొర‌వ తీసుకుంటున్నారు. జిల్లాల్లోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ… టూరిజం ప్ర‌మోష‌న్ లో స‌హ‌చ‌ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తున్నారు.

మ‌రోవైపు ఐటీ ఉద్యోగులు, యువ‌త, వివిధ సంఘాలు, స్థానికుల స‌హకారంతో తెలంగాణ ప‌ర్యాట‌క ప్రాంతాల గురించి విస్తృత ప్ర‌చారం రాబట్టాల‌ని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా హైటెక్ సిటీ ర‌హేజా మైండ్ స్పేస్ లో ఐటీ ఉద్యోగుల‌తో మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఐటీ ఉద్యోగుల‌కు డిస్కౌంట్ కూప‌న్ ను లాంచ్ చేశారు. ప‌ర్యాట‌క అభివృద్ధికి చేయూత‌నివ్వాల‌ని వారిని కోరారు. టూరిజం ప్ర‌మోష‌న్ లో భాగంగా మైండ్ స్పేస్ లో ప‌ని చేస్తున్న ఐటీ ఉద్యోగుల‌కు హ‌రిత హోట‌ల్స్ లో 15 శాతం డిస్కౌంట్ అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని, దీన్ని మ‌రిన్ని ఐటీ కంప‌నీ ఉద్యోగుల‌కు విస్త‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు. స్కాన్ కోడ్ లో రిజిస్ట‌రైన ఐటీ ఉద్యోగులు ఈ డిస్కౌంట్ కూప‌న్ ను వినియోగించుకోవ‌చ్చ‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ… తెలంగాణ ప‌ర్యాట‌కానికి విస్తృత ప్ర‌చారం (మార్కెటింగ్) క‌ల్పించి, ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించేందుకు తానే స్వ‌యంగా సేల్స్ మెన్ అవ‌తారం ఎత్తి ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి – సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమ‌ని, చరిత్ర, వారసత్వ సంపద, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, జ‌ల‌వ‌న‌రులు, సెలయేర్లు, దేవాలయాలు, ఎకో టూరిజం, ట్రైబల్‌ టూరిజం, ట్రైబల్‌ సంసృతి, మెడికల్‌ టూరిజం లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని వివ‌రించారు. ఇన్ని వైవిద్యమైన ప్రదేశాలు ఉన్న తెలంగాణ ప్రాంత పర్యాటక రంగం కనీస ప్రచారానికి కూడా నోచుకోలేదని అన్నారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యంలో తెలంగాణ ప‌ర్యాట‌కాన్ని కొత్త‌పుంత‌లు తొక్కించ‌బోతున్నామ‌ని, దేశీయ‌, అంతర్జాతీయ‌ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించేందుకు ఆధునిక మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. యాంత్రిక జీవ‌న విధానం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు పాశ్చ‌త్య దేశీయులు వారంతాల్లో మాన‌సికోల్లాసం, ఆట విడుపు కోరుకుంటార‌ని తెలిపారు. వారానికి లేదా నెల‌కు ఒక్క‌సారైనా ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప‌ర్యటించాల‌ని ప‌ర్యాట‌కుల‌ను కోరారు. ప‌ర్యాట‌కంలో మ‌న సంస్కృతి, సాంప్ర‌దాయాలు ప్ర‌తిబింబించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో తెలంగాణ క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించే ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. అన్ని జిల్లాలలోని పర్యాటక ప్రాంతాల్లో వసతులు క‌ల్పించ‌డం ద్వారా అంతర్గత పర్యాటకాన్ని ప్రోత్సాహించేందుకు కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి వ‌ల్ల‌ సందర్శకుల సంఖ్య పెరిగి వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా వివిధ విమ‌నాశ్ర‌యాలు, రైల్వే స్టేష‌న్, ఇత‌ర ప్రాంతాల్లో తెలంగాణ ప‌ర్యాట‌క ప్రాంతాల ప్ర‌ద‌ర్శించి.. విస్తృత‌ ప్ర‌చారం నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ప‌ర్యాట‌క శాఖ కొత్త వెబ్ సైట్ ను లాంచ్ చేస్తామ‌ని అన్నారు.

ఈ కార్యక్ర‌మంలో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి వాణిప్ర‌సాద్, ప‌ర్యాట‌క శాఖ సంచాల‌కులు ఇలా త్రిపాఠి, ర‌హేజా గ్రూప్ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ గోనే శ్ర‌వ‌ణ్ కుమార్, హైద‌రాబాద్ సాప్ట్వేర్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ మెంబ‌ర్ బిపిన్ చంద్ర‌, ఐటీ ప్ర‌మోష‌న్ అమ‌రనాథ్ రెడ్డి, ఐటీ ఐద్యోగులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

Topics

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img