గొల్ల కుర్మ యాదవుల కోసం యాదవ్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు ను కలిసి వినతిపత్రం సమర్పించిన యాదవ హక్కుల పోరాట సమితి. యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు వంశీ మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నాడు గాంధీ భవన్ లో మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమాజంలో 20 శాతం ఉన్న యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలని, సీట్ల కేటాయింపులలో ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని, రాజకీయ, ఆర్థిక రంగాలలో తగు గుర్తింపు ఇవ్వాలని కోరారు.. ఈ సందర్భంగా ఆయన వెంట మేకల రాములు యాదవ్ తదితరులు ఉన్నారు.