TGSRTC: పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోన్న సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఈ పథకాన్ని శుక్రవారం వరకు 68.60 కోట్ల మంది మహిళలు వినియోగించుకుని, రూ.2350 కోట్లను ఆదా చేసుకున్నారయని ఆయన తెలిపారు. సంస్థలోని ప్రతి ఒక్క సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో చేస్తుండటం వల్లే మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందని ప్రశంసించారు. హైదరాబాద్ బస్ భవన్ లో శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థలోని అన్ని విభాగాల పనితీరు, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్థికపరమైన అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.

అనంతరం క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తోన్న కండక్టర్లు, డ్రైవర్లతో వర్చ్‌వల్‌గా సమావేశమయ్యారు. మహబుబాబాద్, హయత్ నగర్ -2, నిజామాబాద్-2, అసిఫాబాద్, హుస్నాబాద్, నారాయణపేట, మిర్యాలగూడ, మధిర, సిద్ధిపేట, సంగారెడ్డి డిపోలకు చెందిన సిబ్బందితో స్వయంగా ముచ్చటించారు.

మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు ఇప్పుడున్న సర్వీసుల కంటే మెరుగైన రవాణా సౌకర్యాలకు ప్రయాణికులకు కల్పించాలని అధికారులకు సూచించారు.

దాదాపు 12 ఏళ్ల తర్వాత సంస్థలో 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని, జాబ్ కేలండర్ ప్రకారం ఆయా పోస్టులను వీలైనంత త్వరగా ప్రభుత్వం భర్తీ చేస్తుందని వివరించారు. కొత్త బస్సుల కొనుగోలుతో మరిన్ని ఉద్యోగాలు సంస్థకు అవసరమవుతాయని, అందుకు ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదనలు పంపుతుందున్నారు.

ఆర్టీసీకి రాష్ట్రప్రభుత్వం సహాయసహకారాలను అందిస్తోందని చెప్పారు. ఇప్పటికే 2017కు సంబంధించిన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. పెండింగ్ లో ఆర్పీఎస్ బాండ్లకు సంబంధించిన రూ.200 కోట్లను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. విడతల వారీగా ఆర్టీసీ ఉద్యోగులు పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. సంస్థను మరింతగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు 38 డిపోల్లో లాభాల్లో ఉన్నాయని, మిగతా డిపోలు కూడా వృద్ధి సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కార్గో సేవలను విస్తరించేందుకు రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రయాణికులే వల్ల సంస్థ మనగలుగుతోందని, వారితో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. సంస్థను తమ కుటుంబంలా భావించి ముందుకు తీసుకెళ్లాలని, ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు రూ.2350 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని, జీవో ప్రకారం రీయంబర్స్ కింద ఇప్పటివరకు రూ.1740 కోట్ల నిధులను ప్రభుత్వం సంస్థకు విడుదల చేసిందని తెలిపారు. ప్రతి రోజు సగటున 30 లక్షల మంది మహిళలను సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతోందని వివరించారు.

సిబ్బంది కష్టపడి చేయడం వల్ల త్వరలోనే సంస్థ బిలియన్ డాలర్ (రూ.8500 కోట్లు) టర్నోవర్ కార్పొరేషన్ గా అవతరించబోతుందని తెలిపారు. ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్ గా సంస్థ నిలిచిందని వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణ కాంత్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, వినోద్ కుమార్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ఫతో పాటు హెచ్ఓడీలు, ఆర్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడిక‌ల్ ఫెసిలిటీ స్కీం స‌భ్య‌త్వం విస్త‌రింపు

రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడిక‌ల్ ఫెసిలిటీ స్కీం (REMFS) కింద ల‌భించే ప్ర‌యోజ‌నాల‌ను స్వ‌చ్ఛందంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఉద్యోగుల‌కు సంస్థ వర్తింపజేసింది. గ‌తంలో ఉన్న నిబంధ‌న‌ల్లో మార్పు చేస్తూ కొత్త స‌ర్కుల‌ర్‌ను సంస్థ జారీ చేసింది. ఈ మేర‌కు మార్పులు చేసిన స‌ర్కుల‌ర్‌ను ఈ సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ విడుద‌ల చేశారు. మెడిక‌ల్ రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొంద‌ని బాధిత జీవిత భాగ‌స్వాములూ ఈ స్కీం స‌భ్య‌త్వాన్ని పొంది ప్ర‌యోజ‌నాల‌ను పొందనున్నారు. సీలింగ్ ప్ర‌కారం స‌భ్య‌త్వం పొందిన ల‌భ్ధిదారులు జీవిత కాలం వ‌ర‌కు వైద్య ఖ‌ర్చుల‌కు రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు వినియోగించుకునే స‌దుపాయాన్ని సంస్థ కల్పించింది.

తార్నాక ఆస్పత్రిలో ఫార్మసీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వైద్య పరీక్షా కేంద్రాల ప్రారంభం

హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో శనివారం ఉదయం నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. తార్నక ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్యులతో మంత్రి సమావేశమయ్యారు. సిబ్బందికి అందిస్తోన్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, తమ కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ వైద్య సేవలను అందించాలని డాక్టర్లకు సూచించారు. తార్నక ఆస్పత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని సదుపాయాలను సిబ్బంది వినియోగించుకోవాలన్నారు.

టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తూ తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా సంస్థ మార్చిందని అన్నారు. ప్రస్తుతం ప్రతి రోజు 1500 మంది ఉద్యోగులు ఓపీ సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కృష్ణకాంత్, మునిశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ఫ, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, ఓఎస్డీ సైదిరెడ్డి, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, తపాడియా డయోగ్నస్టిక్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్ఎస్ తపాడియా, తదితరులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img