హైదరాబాద్ నారాయణగూడ తాజ్ మహల్ హోటల్ లో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వారి ఆత్మీయ సమ్మేళనం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం ఏ స్థాయిలో ప్రగతి సాధించిందో మన కళ్లముందే ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత UPA తో పోల్చుకుంటే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆయన అన్నారు. ఉగ్రవాదం, దేశ భద్రత, సమగ్రత విషయంలో మోడీ చూపిన చొరవను ఎవరు తీసేయలేరన్నారు. ప్రపంచంలో దేశ ప్రతిష్టను, గౌరవాన్ని మోడీ పెంచారని అన్నారు. మౌలిక రంగాల అభివృద్ధిలో మనం రోడ్స్ నుంచి విమానాశ్రయల వరకు అద్భుత ప్రగతి సాధించామని గుర్తుచేశారు. విపత్కరమైన కరోనా నుంచి దేశాన్ని గట్టి ఎక్కించడమే కాదు.. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత మనది అని అన్నారు. కరోనాలో డాక్టర్స్ చూపించిన చొరవ అనిర్వచనీయం.. అందుకే మోడీ డాక్టర్స్ పై పూల వర్షం కురిపించారని గుర్తుచేశారు. వ్యాక్సిన్ విషయంలో ప్రధాని తీసుకున్న చొరవ డాక్టర్స్ గా అందరికి తెలుసని అన్నారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చేవిధంగా అందరూ సహకరించాలని కిషన్ రెడ్డి డాక్టర్లను కోరారు.