భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన నారిశక్తీ వందన్ 3k రన్ గచ్చిబౌలీలో జరిగింది. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డ ఆద్వర్యంలో ఈ రన్ నిర్వహించారు. మన దేశంలో మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడి రాణించాలని నేతలు కోరారు. ప్రతి మహిళా ఒక శక్తి అని.. వారికి అన్ని చోట్ల ప్రాధాన్యత ఇవ్వాలని, పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించి సమన్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రతి మహిళకు దక్కిన అరుదైన గౌరవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చ రాష్ట్ర కార్యదర్శి గీత, మహిళా మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్పందన, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.