Tuesday, April 22, 2025
HomeNewsTelanganaముత్తిరెడ్డి Vs పల్లా : జనగామ టికెట్ లొల్లి .. ప్రగతి భవన్ దగ్గర హోటల్...

ముత్తిరెడ్డి Vs పల్లా : జనగామ టికెట్ లొల్లి .. ప్రగతి భవన్ దగ్గర హోటల్ లో నిన్న ముత్తిరెడ్డి వ్యతిరేకుల భేటీ.. నేడు మల్లాపూర్ లో ముత్తిరెడ్డి కౌంటర్ మీటంగ్

జనగామ నిమోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్ఎస్ నేతలు సీఎం క్యాంప్ కార్యాలయం పక్కనే ఉన్నటూరింజం ప్లాజా హోటల్ లో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే టికెట్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇవ్వవద్దని అసమ్మతి నేతలు అంటున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికె టికెట్ కేటాయిచలని.. ఈ విషయమై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానికి తమ అభిప్రాయాలు తెలిపేందుకే సీఎం క్యాంప్ కార్యాలయానికి దగ్గరలోని టూరిజం హోటల్ లో భేటీ అయ్యామని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి హుటాహుఠిన హోటల్ కు చేరుకున్నారు. దీంతో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన అసమ్మతి నేతలు అక్కడికి ఎమ్మెల్యే రావడంతో షాక్ అయ్యారు.

అధిష్టానం పిలిస్తేనే తాము అక్కడికి వచ్చామని చెప్పటంతో ఎమ్మెల్యే షాక్ అయ్యారు. వారంతా ఈసారి టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరతామని చెప్పారు. టికెట్ విషయాన్ని ముత్తిరెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి తేల్చుకోవాలని వారు తేల్చి చెప్పారు. వెంటనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హోటల్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన వారిలో ఒకరిద్దరు మినహా మిగతా అందరూ కీలక నేతలు కాదని అన్నారు. నియోజకవర్గంలోని అందరు నాయకులు తన వెంటే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఈసారి కూడా సిట్టింగ్ లకే టిక్కట్లు అన్నారని.. ఈసారి తనకే టికెట్ వస్తుందని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే, వారిని ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు పల్లా రాజేశ్వర్ రడ్డి తీసుకెళ్లారు.

జనగామ టికెట్ కోసం పార్టీలో ఐదుగురు పోటీ

జనగామ అసెంబ్లీ స్థానం కోసం ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు పోటీ పడుతున్నట్లుగా నియోజకవర్గంలో జోరుగా వినబడుతుంది. వీరితో పాటు లోకల్ నాయకుడుగా మండల శ్రీరాములు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అలాగే, చేర్యాల మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం తనయుడు నాగపురి కిరణ్ గౌడ్ కూడా లోకల్ నినాదంతో టికెట్ ఆశిస్తున్నారు. మొత్తానికి ఐదుగురు నేతలు జనగామ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో అసమ్మతి నేతలు టూరిజం ప్లాజాలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నియోజకవర్గ నాయకులతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కౌంటర్ సమావేశం

ముత్తిరెడ్డికి మద్దతుగా నియోజకవర్గం నుండి ముఖ్య కార్యకర్తలు హైదరాబాద్ లోని నోమా ఫంక్షన్‌హాల్‌కు వచ్చారు. తనకు మద్దతుగా వచ్చిన నాయకులతో ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. నిన్నటి హోటల్ మీటంగ్ పై తీవ్రంగా విమర్శించారు. తాను అక్కడికి వెళితే వారు తలుపులు మూసుకొని ఉన్నారని అన్నారు. గంప కింద కోళ్లను కమ్మినట్టు వారిని హోటల్ లో ఉంచారని అన్నారు. ఇలాంటి కుట్రలను, పార్టీకి నష్టం కలిగించే చర్యలను సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరని అన్నారు. తాను గూండాలను కంట్రోల్ చేసిన గూండానే అని చెప్పుకున్నారు. తనపై కావాలనే కుట్రలు చేస్తున్నారని అన్నారు. తాను సీఎం కేసీఆర్ కు సైనికుడని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కార్యకర్తలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. పల్లా వద్దు, ముత్తిరెడ్డి ముద్దు అంటూ అక్కడకు వచ్చిన కార్యకర్తలు నినాదాలు చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments