వరంగల్ పరిధిలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయండి.. రైల్వే జీఎంకు ఎంపీ కడియం కావ్య విజ్ణప్తి

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మెనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి సమావేశం అయ్యారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని జీఎంకు వినతి పత్రం అందజేశారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అనేక రైల్వే పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని సత్వరమే పూర్తి చేయాలని వారు కోరారు.

కాజీపేట మరియు వరంగల్ స్టేషన్లు రెండూ భారతీయ రైల్వేలో చాలా ముఖ్యమైన స్టేషన్లు, అవి రైల్వేలోని ఉత్తర మరియు దక్షిణ భారతదేశ భాగాలను కలిపే బహుళ దిశల రైలు ట్రాఫిక్‌తో వ్యవహరిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రధానంగ కాజీపేట స్టేషన్ అభివృద్ధిలో భాగంగా అదనపు ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ మరియు కాజీపేట రైల్వే స్టేషన్లలో ప్రజల రాకపోకల దృష్ట్యా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మరియు ఎస్కలేటర్లతో కూడిన మరో రెండు ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసారు.

కాజీపేట టౌన్ స్టేషన్‌ను పూర్తి స్థాయి స్టాపింగ్ స్టేషన్‌గా మార్చేందుకు కృషి చేయాలని అభ్యర్థించారు.

కాజీపేటలో 3000 మందికి పైగా రైల్వే ఉద్యోగులు మరియు వైద్య సహాయం అవసరమయ్యే రిటైర్డ్ ఉద్యోగస్తులు సమాన సంఖ్యలో ఉన్నారని వారఅందరి కోసం కాజీపేటలో రైల్వే సబ్-డివిజనల్ హాస్పిటల్ అభివృద్ధి చేయడంతో పాటు అదనపు సిబ్బంది, అదనపు సౌకర్యాలు, నిపుణులైన వైద్యులతో పూర్తిస్థాయి సబ్‌ డివిజనల్‌ ఆసుపత్రిని ప్రారంభించేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని, ఈ అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయాలని కోరారు. రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ /ఉద్యోగుల రిక్రియేషన్ క్లబ్ కొత్త భవనం ఏర్పాటుతో పాటు కమ్యూనిటీ హాల్ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో అనేక డివిజన్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని ఇక్కడ నుండి అధిక సంఖ్యలో అధికారులు హైదరాబాద్ మరియు విజయవాడలకు వెళతారు. ఈ రైల్వే స్టేషన్ చుట్టూ దాదాపు 60 గ్రామాలు ఉన్నాయని, ప్రజలు మరియు ముఖ్యంగా వ్యాపారవేత్తలు హైదరాబాద్ మరియు తిరుపతికి తరచుగా ప్రయాణిస్తుంటారు. దీనిని పరిశీలించి, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెగ్యులర్‌గా ఆగేవిధంగా చూడాలని కోరారు.

నష్కల్‌ నుండి హాసన్ పర్తి, మరియు నష్కల్‌ నుండి చింతలపల్లి వరకు రెండు మార్గాల్లో రైల్వే బైపాస్‌ లైన్‌ లను నిర్మించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయో ప్రమాదం ఉందని, మరోవైపు వరంగల్ పట్టణ ప్రాంతం గుండా వెళ్లే రైల్వే బైపాస్ మార్గం వలన పట్టణాభివృద్ధికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని జీఎం గారికి దృష్టికి తీసుకువెళ్లి, దీనికి ప్రత్యామ్నాయంగా అలైన్ మెంట్ లో మార్పుచేసి మరో మార్గములో రైల్వేలైన్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

దక్షిణ మధ్య రైల్వేలో మరో డివిజన్ ఉండేలా కాజీపేట డివిజన్‌ను ఏర్పాటు చేయడంలో అన్ని సమర్థన మరియు ప్రయోజనం ఉందని, ఈ అంశాన్ని పరిశీలించి కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చెయాలని కోరారు.

అనంతరం రైల్వే సబ్ డివిజన్ హాస్పిటల్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించిన జీఎం ఆస్పత్రి అభివృద్ధి పనుల కోసం 1.75 కోట్లు మంజూరు చేసినట్లుగా తెలియజేసారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరియు కాజీపేట రైల్వే స్టేషన్ లో అదనపు ఫ్లాట్ ఫారమ్ ల ఏర్పాటు విషయంలో సానుకూలంగా స్పందించిన జిఎం త్వరలో అదనపు ఫ్లాట్ ఫారమ్ ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కాజీపేట టౌన్ స్టేషన్ వెయిటింగ్ హాల్ టాయిలెట్స్ నిర్మాణ పనులు చేపడతామని జీఎం తెలిపారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రైల్వే బోర్డుకు అందజేయడం జరిగిందని, రైల్వే బోర్డు నిర్ణయం మేరకు త్వరలోనే డివిజన్ ఏర్పాటుకు చర్యలు చేపడతమన్నారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెగ్యులర్‌గా ఆగేవిధంగా ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. నష్కల్ నుండి హాసన్ పర్తి వరకు మరియు నష్కల్‌ నుండి చింతలపల్లి వరకు రెండు మార్గాల్లో రైల్వే బైపాస్‌ లైన్‌ మార్గాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటును పరిశీలిస్తామని రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ విషయాలపై సమీక్షించి, తక్షణ చర్యలు చేపడతామని జీఎం హామీ ఇచ్చారని, తన అభ్యర్ధనలపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించినందుకు వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గారు స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు ధన్యవాదాలు తెలియజేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

Topics

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img