కొమురవెల్లి మల్లన్న ఆశీర్వాదంతో జనగామ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కొమురవెల్లి లో ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 16న జనగామలో కేసీఆర్ మీటింగ్ ఉంటుందని.. ఆ మీటింగ్ లో పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేస్తారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.