ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. గత ఆరు సంవత్సరాలుగా చేర్యాల ప్రాంత ప్రజలు రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. BRS పార్టీ జనగామ టికెట్ నిన్న కన్ఫర్మ్ అయిన తర్వాత, ఈరోజు కొమురవెల్లికి వచ్చిన పల్లా, చేర్యాలలో రెవెన్యూ డివిజన్ కోసం నాయకులు నిరాహార దీక్ష చేస్తున్న వద్దకు వెళ్లారు. వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించనందుకు.. పల్లా రాజేశ్వర్ రెడ్డిని పల్లా గోబ్యాక్ -పల్లా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పల్లా వర్గీయులు జై చేర్యాల-జై పల్లా అంటూ నినాదాలు. ఇరు వర్గాల నినాదాలతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం ఎమ్మెల్సీ అక్కడి నుండి వెనుదిరిగారు.