తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షునిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం మద్యాహ్నం గాంధీభవన్ లో ప్రస్తుత పీసీసీ రేవంత్ రెడ్డి నుండి భాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఏఐసీసీ నాయకులు, ఇతర నేతలు పాల్గొన్నారు. అంతకుముందు మహేష్ కుమార్ గౌడ్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, అక్కడి నుండి నుండి గాంధీభవన్ కు ర్యాలీగా వచ్చి పీసీసీ పగ్గాలు చేపట్టారు.
ఈ సంధర్బంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. గాంధీభవన్ దేవాలయం అని.. సోనియా గాంధీ దేవత అని అన్నారు. ప్రజలకు ఆకాంక్షలకు అనుగణంగా తెలంగాణను సోనియాగాంధీ ఏర్పాటు చేశారని అన్నారు. సోనియా గాంధీవల్లే తెలంగాణ కల సాకారం అయిందని అన్నారు. పర్టీని నమ్ముకుంటే పదవులు అవే వస్తాయన్నారు. పార్టీ తనకు అనేక పదవులు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ లో పవర్ సెంటర్ లు అనేవి లేవని.. ఉన్నది ఒకే పవర్ సెంటర్ అనీ, అది రాహుల్ గాంధీయే అని అన్నారు. సోషల్ ఇంజనీరింగ్ అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అవుతుందని అన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ సోషల్ ఇంజనీరింగ్ పట్ల చిత్త శుద్దితో ఉన్నారని తెలిపారు. మతాలకు, కులాలకు అతీతంగా అందిరినీ అక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. ఎన్నడూ లేనివిధంగా గత పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు చెరువులను కబ్జాలు చేశారని అన్నారు. ఇప్పుడు హైడ్రాతో చెరువులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. నెలలో ఒకసారి సీఎం గాంధీ భవన్ కు రావాలని సూచించారు. అలాగే వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీ భవన్ లో అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడకు వచ్చే సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. గాంధీభవన్ లో ఉంటేనే ప్రభుత్వం ఉంటుందని.. పార్టీ లేకుండా ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ప్రతీ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుండి పీసీసీ అధ్యక్షుడిగా అయ్యేవరకు తనకు సాయం అందించిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల సహకారం మరచిపోనని అన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. కార్యకర్తలకు తాను, సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటామని అన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్లో ముఖ్యమంత్రి, మాజీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.
— Congress for Telangana (@Congress4TS) September 15, 2024
Bomma Mahesh Kumar Goud takes charge as the Telangana Pradesh Congress Committee president, in the presence of Chief… pic.twitter.com/azIh9OlF2f