ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) స్ట్రీట్ ఫుడ్ (Street food) రుచిచూసారు. అస్సాం (assam) రాష్ట్ర రాజధాని గౌహతి (Guwahati) నగరంలోని వీధుల్లో సోమవారం సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్డు (Mobile food court) వద్ద ఆగి మోమొస్ (Momos) తిన్నారు. అంతే కాకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు. స్ట్రీట్ ఫుడ్ వద్దని ఎవరంటారు.. ప్రత్యేకించి మోమొస్ లాంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు అంటూ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో ట్యాగ్ లైన్ రాసి పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. కవిత సింప్లిసిటీకి ఈ వీడియో అద్దం పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. వీడియోను మీరూ ఓ లుక్కేయండి.