జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలో సహస్ర దీపాలంకరణలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి అనుబంధ దేవాలయం బేతాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహంచారు. అంతకుముందు వేద పండితులు ఎమ్మెల్సీ కవితకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జడ్పి చైర్ పర్సన్ వసంతతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.