MLC Kavitha: అరవింద్ నోరు అదుపులో పెట్టుకో.. నువ్వు ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తా

కేసీఆర్ పేరు చెబితే బిజెపి, కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని, ఆ భయంతోనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిలో బిజెపి పాత్ర సున్నా అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి బీఆర్ఎస్ఎల్పీ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కవిత మాట్లాడారు. తెలంగాణలో అన్ని రంగాల్లో a అధ్బుతంగా ముందుకు వెళ్తున్నదని తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ మంత్రి కేటీఆర్ ఐటీ హబ్ ను ప్రారంభించారని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని నిధులు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. ఐటీ హబ్ ను ప్రారంభించిన రోజే ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉక్కు సంకల్పంతో ప్రయత్నాలు చేసి మంచి మంచి కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. ఐటీ టవర్ సామర్థ్యం 750 ఉద్యోగాలుగా ఉంటే మొదటి రోజే 280 మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. అది చూసి ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ నేతలు మహేశ్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ అక్కసు వెళ్లగక్కారని, బీజేపీ ఎంపీ అర్వింద్ అలవాటు ప్రకారం అత్యంత దారుణంగా మాట్లాడారని అన్నారు. 280 ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారని, ఆయన కార్యాలయంలోనే 20 మంది పనిచేస్తున్నారని అర్వింద్ మాట్లాడారని అన్నారు. తాము జీతగాళ్ల గురంచి మాట్లాడడం లేదని, ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నామని చెప్పారు. ఐటీ టవర్ రావడం వల్ల నిజామాబాద్ యువతకు కొత్త ఉత్సాహం, ఉత్తేజం వచ్చిందని ఆమె అన్నారు. ఎందుకు అంత అక్కసు ? పిల్లలకు ఉద్యోగం వస్తే ఎందుకు అంత కళ్లమంటా ? పిల్లలు మీ వెంట జెండాలు పట్టుకొని జై కొట్టుకుంటూ తిరగాలా ? అని నిలదీశారు.

నిజామాబాద్ ఐటీ హబ్ ను విస్తరిస్తామని, దానితో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని అన్నారు.నిజామాబాద్ లో 2 లక్షల 77 వేల మంది పెన్షన్లకు రూ. 4 వేల కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసిందని, రైతు బంధు కింద 2.59 లక్షల రైతులకు రూ. 2616 కోట్లు ఇచ్చామని, మరణించిన రైతుల కుటుంబాలకు రైతు బీమా పథకం కింద రూ. 239 కోట్లు అందాయని, రుణమాఫీ కింద రూ. 2800 కోట్లు నిజామాబాద్ రైతులకు వచ్చాయని లెక్కలతో సహా వివరించారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇస్తోందని, కానీ కేంద్రం మాత్రం తన వాటాను విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఈ మొత్తంలో బీజేపీ తోడ్పాటు ఏమీ లేదని, నిజామాబాద్ కు ఇది కావాలని స్థానిక ఎంపీ ఎప్పుడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఒక్కసారైనా తెలంగాణ హక్కుల గురించి పార్లమెంటులో బీజేపీ ఎంపీలు మాట్లాడారా ? అని బెజేపీని నిలదీశారు.

పార్లమెంటులో ఎంపీ బండి సంజయ్ అబద్దాలు మాట్లాడారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అడిగితే ఇవ్వకపోగా.. మధ్య ప్రదేశ్ లో ఎన్నికలు వస్తున్నాయని రాజకీయ ప్రయోజనాలను ఆశించి, ఆ రాష్ట్రంలో ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పార్లమెంటులో అబద్ధం చెప్పిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై తమ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసిందని తెలిపారు. కాళేశ్వరానికి రూ. 86 వేల కోట్లు ఇచ్చామని నిశికాంత్ దూబే అబద్ధం చెప్పారని, దానికి కొనసాగింపుగా ఈ రోజు బండి సంజయ్ తమ నాయకుడిని వ్యకిగతంగా తిట్టారని, అయినా, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని స్పష్టం చేశారు. “24 గంటల కరెంటు ఎక్కడ వస్తుందని అంటున్నారు. బండి సంజయ్ అన్నా… కరీంనగర్ లోని మీ ఆఫీసుకన్నా పోదాం… లేదంటే, ఇక్కడ హైదరాబాద్ బీజేపీ ఆఫీసుకన్నా రా. కరెంటు తీగలు పట్టుకో. ఏ సమయంలో అయినా కరెంటు తీగలు పట్టుకోవాలని సవాలు చేస్తున్నా ” అని అన్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారని అడిగారు.

పార్లమెంటు సభ్యలయ్యే అవకాశం కోట్లల్లో ఒకరికి వస్తుందని, అలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రజలు, ప్రాంతం, రాష్ట్రం కోసం పనిచేయాలని సూచించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఇన్ని రోజులు ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా పార్లమెంటులో తెలంగాణ కోసం పెదవి విప్పి మాట్లాడింది లేదని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్కటి కూడా సాధించుకురాలేదని, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాబట్టలేదని మండిపడ్డారు.“నువ్వెక్కడ పోటీ చేస్తావ్.. నేనెక్కడ పోటీ చేస్తా అని మా ఎంపీ అరవింద్ ఏదేదో మాట్లాడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటులో ఏడు సెగ్మెంట్లు ఉంటే ప్రతీ సెగ్మెంట్ లో వాళ్ల పార్టీలో ముగ్గురిని ముందు పెడుతాడు ఆయన. అందరితో పైసలు ఖర్చు పెట్టిస్తాడు. నీకే టికెట్ ఇస్తా అంటూ అందరినీ ముంచుతాడు. ఇటీవల అందరు కలిసిపోయి ఆయన కార్యాలయంపై దాడి చేశారు. ఒక పక్క ప్రజలను, మరో పక్క వాళ్ల సొంత పార్టీ నాయకులను మోసం చేస్తాడని ధ్వజమెత్తారు. తాను గతంలో చెప్పినట్టు అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తానని పునరుద్ఘాటించారు. ఎంపీగా పోటీ చేయకుండా కోరుట్ల పారిపోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అర్వింద్ చెప్పుకుంటున్నారని, తాను ఎక్కడికీ పోనని, నిజామాబాద్ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసి తప్పకుండా గెలుస్తానని ప్రకటించారు. నిజామాబాద్ తన సొంత ఊరని, తన అత్తగారి ఊరని, తాను బతికున్నా.. సచ్చినా తన కట్టె కాలుడు కూడా నిజామాబాద్ లోనే ఉంటుందని కవిత ఉద్వేగంగా మాట్లాడారు. తాను పారిపోయేదాన్ని కాదని, కచ్చితంగా నిజామాబాద్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అర్వింద్ కోరుట్ల పోయినా అక్కడికి వచ్చి కూడా ఓటిస్తానని శపథం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినా, సర్పంచ్ గా, ఎంపీటీసీగా పోటీ చేసినా సరే కానీ ముందు వాగడం తగ్గించుకోవాలని అర్వింద్ కు ఆమె హితవుపలికారు. కొంత మర్యాద నేర్చుకోవాలని సూచించారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారసుడైన మహేశ్ కుమార్ గౌడ్ కూడా తన పస లేని వాదనలతో అడ్డగోలుగా మాట్లాడారని, నిజామాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. ఐదింటికి ఐదు సీట్లు మళ్లీ తామే గెలుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తోనే తమ పోటీ అయినప్పటికీ, ఆ పార్టీ కూడా చాలా దూరంలో ఉంటుందని, ఆ పార్టీకి తమ పార్టీకి మధ్య ఎక్కడా చూసినా కచ్చితంగా 20 శాతం గ్యాప్ ఉంటుందని తెలిపారు. తమకు ప్రశాంత్ కిషోర్ అవసరం లేదని, కేసీఆర్ చాలని అన్నారు. గతసారి కంటే ఎక్కువ మెజారిటీతో తమ పార్టీని ప్రజలు దీవిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పేరు చెబితే అన్ని జాతీయ పార్టీల్లో భయం ఉందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్ కు భయపడుతున్నాయని అన్నారు. అందువల్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయాయని బీజేపీ వాళ్లు అంటారని, బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందని, తమకు ఈ అనుభవం కొత్త కాదని స్పష్టం చేశారు. గొప్ప శక్తి వస్తున్నప్పుడు భయపడి రకరకాల ఆరోపణలు చేస్తుంటారని చెప్పారు. నిజామాబాద్ లో మధు యాష్కి అనే సీనియర్ ఎంపీకి డిపాజిట్లు ఎలా పోతాయని అడిగారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కాలేదా అక్కడ అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దగ్గరుండీ బీజేపీకి ఓట్లు వేయించలేదా అని అడిగారు. పార్టీలు, సిద్ధాంతాలను పక్కనబెట్టి వ్యక్తిగత ద్వేషంతో సీఎం కేసీఆర్ పై పగతో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని తెలిపారు.

ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఎలా పక్కనబెట్టడానికి కేంద్రం బిల్లును తీసుకోచ్చిందని, కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తని తప్పించడాన్ని కవిత తప్పుబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారు అనుకున్న వారే ఎన్నికల కమిషనర్లు అవుతారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయా అన్న ప్రశ్న తలెత్తుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ తీసుకొచ్చే అంశమని అన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

Telangana Talli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదే

సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ...

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

Topics

Telangana Talli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదే

సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ...

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img