తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ (TSRTC CHAIRMAN)గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం భాద్యతలు చేపట్టారు. బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఆయన చైర్మన్ గా భాద్యతలు తీసుకున్నారు. ముత్తిరెడ్డి ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు.