హరీష్ రావు “ఎక్స్” వేదికగా స్పందించారు. రాజకీయాల్లో గెపోటములు సహజమని, 24ఏళ్ల బీఆర్ఎస్ చరిత్రలో పార్టీ ఎన్నో ఒడిదొడుకులను చూసిందని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని అన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదని ఆయన అన్నారు. లక్షల మంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బిజెపి ఎన్నికల హామీలు అమలు చేసేలా నిలదీస్తామని అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ, తమని తాము సంస్కరించుకుంటూ.. భవిష్యత్తుపై సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు కదులుతామని తెలిపారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 24ఏళ్ల చరిత్రలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది. ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదు.
— Harish Rao Thanneeru (@BRSHarish) June 4, 2024
లక్షల మంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో…