ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు సంబందించి రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ పెద్దలు, రాష్ట్ర నాయకులు కలిసి కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫాంపైన గెలిచిన వారికే మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని మీడియా చిట్ చాట్ లో సీఎం కుండ బద్దలు కొట్టారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇంకా కొంతమంది చేరే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణకు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని..రుణంపై వడ్డీ తగ్గించగలిగితే ప్రతీ సంవత్సరం రాష్ట్రానికి వెయ్యికోట్ల రూపాయలు ఆదా అవుతాయని అన్నారు. IAS, IPS అధికారుల విషయంలో రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదని సీఎం తెలిపారు. గతంలో సీఎంగా కేసీఆర్ చేసిన తప్పులను తాము చేయబోమని మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ తెలిపారు.