ఆసిఫాబాద్ నియోజకవర్గం, ఆసిఫాబాద్ మండల కేంద్రంలో మర్సుకొల సరస్వతి సోదరుడు కొట్నాక సుధాకర్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి వర్యులు సీతక్క మరియుకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. ప్రగాఢ సంతాపం తెలియజేశారు ..వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్, నియోజకవర్గం ఇంచార్జీ శ్యాం నాయక్,మండల అధ్యక్షులు చరణ్ గౌడ్, మరియు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్ని నివాళులర్పించారు.