జూన్ 25 ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక ముఖ్యమైన దేవాలయాల వారీగా సమావేశాలు కొనసాగుతుండడంతో జూలై 8,9,10 వ తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవాల పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహంచారు.
జూలై 8,9,10 తేదీల్లో జరిగే అమ్మవారి కళ్యాణం , రథోత్సవం , తదితర కార్యక్రమాల పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి మహ లక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గుడి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ,గతంలో భారీకెడ్లు ఎత్తులో ఉండడం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తాయని ఈసారి భారీకెడ్ల ఎత్తు తగ్గించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. సూచిక బోర్డులు , ఎమర్జెన్సీ ఎక్సిట్ గేట్లు , క్యులైన్ లలో భక్తులకు కొంత ప్లేస్ ఉండేవిధంగా ఏర్పాటు చేయడంతో పాటు వారికి తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
గత బోనాల సమయంలో వివిఐపి పాసులు అధికంగా ఇవ్వడం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తాయని పోలిసులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.ఈసారి ప్రతి గుడిలో వీవీఐపీ పాసులు తగ్గేలా దేవాదాయ శాఖ అధికారులు , సమన్వయం చేసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని మహిళా భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గుడికి చుట్టుపక్కల ఉన్న రోడ్లలో ట్రాఫిక్ డైవర్షన్ చేసుకునేలా ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
నిరంతర విద్యుత్ ఉండడంతో పాటు ప్రత్యేక జనరేటర్లు ,మొబైల్ ట్రాన్సఫర్మర్లు , ప్రత్యేక ఎలక్ట్రిక్ ఉద్యోగులు నిరంతరం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ టాయిలెట్స్ , ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలి. బ్లీచింగ్ ద్వారా క్లోరినేషన్ చేయాలి. జీహెచ్ఎంసీ నిరంతర శానిటేషన్ బృందాలను పర్యవేక్షించాలి. 20 వాటర్ ట్యాంకర్లు అదనంగా నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. జూలై 8,9,10 వ తేదీల్లో బల్కంపేట ప్రాంతంలో నిరంతం నీరు అందేలా వాటర్ వర్క్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కళ్యాణం తరువాత రథోత్సవం సమయంలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు.
హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేసి ,చిన్న అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలని.. ప్రత్యేక సీపీఆర్ బృందాలకు శిక్షణ ఇచ్చి అందుబాటులో ఉంచాలని అన్నారు. ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయాలి. టూ వీలర్ ఫైర్ వెహికిల్ శిక్షణ పొందిన ఫైర్ సిబ్బంది ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఆర్టీసి బోనాల జాతర కి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు అధికంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. బస్ స్టేషన్ లో వద్ద ఈవ్ టీజింగ్ కి తావు లేకుండా మహిళా పోలీసు బృందాలు ఏర్పాటు చేయాలి.. ఉత్సవాల సందర్భంగా 500 మంది ప్రత్యేక కళాకారుల వివిధ ప్రదర్శనలు చేయనున్నాయి. భక్తులకు సమాచారం అందించడానికి ఎల్ఈడి స్క్రీన్ లు , దాదాపు కిలోమీటరు దూరం వరకు వినిపించే విధంగా మైక్ సిస్టం ఏర్పాటు చేయాలని సూచించారు.
స్థానిక దేవాలయ కమిటీలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉత్సవాల సందర్భంగా డీజేకి అనుమతి ఇవ్వదని వారు కోరగా పోలీసులు బల్కంపేట ఉత్సవాలకు డిజే అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు అధికారులు తెలిపారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తుల సహకారం కూడా కావాలని ఒక్కో దేవాలయంలో ఒక్కోసారి ఉత్సవాలు జరుగుతున్నందున అధికారులు సమన్వయం చేసుకోవాలని.. అమ్మవారి ఉత్సవాలు విజయవంతంగా జరిగే విధంగా అమ్మ వారి ఆశీర్వాదం ఇవ్వాలని మంత్రి కోరారు.
అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లు
— Ponnam Prabhakar (@PonnamLoksabha) June 25, 2024
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు
అధికారులు సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ… pic.twitter.com/dbZf0CrVIO