సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గంలోని అక్కన్నపేట్, హుస్నాబాద్ మండలాల్లో 15.39 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు.
అక్కన్నపేట మండలం బోడిగెపల్లి గ్రామంలో 1.5 కోట్లతో Pwd రోడ్డు నుండి బోడిగపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బంజారాహిల్స్ తండా లో తాగునీటి పైప్ లైన్లు & నల్లాలను ప్రారంభించారు. గౌరవెళ్లి పంచాయతీ పరిధిలోని సేవలల్ కాలని లో వాటర్ ట్యాంక్ & మంచినీటి పైప్ లైన్ ను ప్రారంభించారు. సేవలాల్ మహారాజ్ తండా లో నూతన తండా -2 వద్ద OHSR & పైప్ లైన్ ప్రారంభించారు.తుక్కితండా ( నందారం) లో 58 లక్షలతో జడ్పీ రోడ్డు నుండి తుక్కితండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గండిపల్లి గ్రామంలో జడ్పీ రోడ్డు 1.54 కోట్లతో వయా దెక్యా నాయక్ తండా మీదుగా శ్రీరాంతండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గండిపల్లి సరేరం క్రాస్ వద్ద కుందనవారి పల్లి నుండి 1.89 కోట్లతో వయా చౌటకుంట తండా సీతారం తండా మీదుగా గండిపల్లి క్రాస్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కుందనవారిపల్లి లో 5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.అక్కన్నపేట మండలం మంజు నాయక్ తండా వద్ద 1.81 కొట్ల రూపాయలతో pwd రోడ్డు నుండి వయా బోజర వాగు తండా , చౌడ తండా , మంజునాయక్ తండా మీదుగా వరంగల్ బోర్డర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు.

హుస్నాబాద్ మండలం హనుమాన్ నగర్ , పోతారం (ఎస్) గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ & మంచి నీటి పైప్ లైన్ నల్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.కుచనపల్లి లో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి & జడ్పీ రోడ్డు నుండి మాలపల్లి వయ కూచనపల్లి వరకు 2 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన & 5 లక్షలతో నూతనంగా నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హల్ ను ప్రారంభించారు. పొట్లపల్లి లో 3.95 కోట్లతో పందిల్ల స్టేజి నుండి పొట్లపల్లి మీదుగా హుస్నాబాద్ వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. మాలపల్లి లో ఓపెన్ జిమ్ & సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. తోటపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంఖు స్థాపన & ఓపెన్ జిమ్ & సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తండాల్లో రోడ్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.నిన్న కొహెడ , చిగురు మామిడి,ఈరొజు అక్కన్నపేట , హుస్నాబాద్ మండలాల్లో అభివృద్ది పనులను ప్రారంభించుకున్నామన్నారు. హుస్నాబాద్ వెనుకబడిన ప్రతి గ్రామంలో రోడ్లు సౌకర్యం కల్పిస్తామన్నారు.నియోజకవర్గంలోతాగు నీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
విద్యా , వైద్యం ,ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రథమ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ,రేషన్ కార్డులు భూమిలేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. రైతులకు రైతు భరోసా అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కారం చేస్తామని గౌరవెల్లి , గండిపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని వెల్లడించారు.

కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి,వైస్ చైర్మన్ బంక చందు, మున్సిపల్ కౌన్సిలర్లు మండల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు,ఆర్డీవో, ఎమ్మార్వో ఇతర అధికారులు
