Friday, March 21, 2025
HomeNewsTelanganaచినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నాం.. కేసీఆర్ లాగా ఫాంహౌస్ లో లేము: మంత్రి...

చినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నాం.. కేసీఆర్ లాగా ఫాంహౌస్ లో లేము: మంత్రి పొంగులేటి

2022లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన భారీ వర్షాలు, వరదలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి వర్షాలు క్లౌడ్-బరస్ట్, విదేశి కుట్ర అంటూ మతిలేని ప్రకటనలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. విదేశీ కుట్ర అని ఫార్మ్ హౌస్ దాటని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఈరోజు వరదల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆనాడు ప్రకృతిపరంగా కురిసిన వర్షాలను కూడా కుట్రకోణంలో చూసిన ఆ పెద్దమనిషి, ఆ దొరవారి అల్లుడు హరీష్ రావు కూడా ఇప్పుడు వచ్చిన వర్షాలను కుట్ర కోణంలోనే చూస్తున్నారా.. అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వరదలపై మంగళవారం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

“వరదల్లో కారు కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు నునావత్ అశ్విని కుటుంబాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి క్యాబినెట్ సహచర మంత్రులం పరామర్శించి, భరోసా కల్పించాం. కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలన్న సోయి కూడా బీఆర్ఎస్ పెద్దలకు లేకపోవడం దురదృష్టకరం అని అన్నారు.

జైలు నుండి వచ్చిన బిడ్డను ఆశీర్వదించడానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సమయం ఉంటుంది కానీ, వరద కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి గడప దాటడం లేదని అన్నారు. పదేండ్ల పాలన అనుభవంతో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక సలహానైనా సూచననైనా చేస్తారని భావించామని, కానీ ఆయన పెదవి కూడా విప్పకపోవడం దురదృష్టకరం… ఇంకా ఆయన కుమారుడు కేటీఆర్ అమెరికాలో ఉండి, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా, అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అని అన్నారు. ఆయన ఎందుకు అమెరికా వదిలి రావడం లేదు ? అధికార పార్టీని తిట్టడమే ప్రతిపక్ష పార్టీ పని అన్నట్టుగా మా మీద దాడి చేస్తున్నారు. ఓటు వేసిన వేలుకు సిరా చుక్క కూడా తొలిగిపోయిందో లేదో అప్పటినుంచే దాడి మొదలుపెట్టారు. పది సంవత్సరాలలో విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఒక్క నాడైనా ప్రకృతి విపత్తులమీద సమావేశం నిర్వహించారా ? దాన్ని బలోపేతం చేయాలన్న ఆలోచన చేశారా ? దాన్ని బలోపేతం చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? కొంతలో కొంతైనా ముప్పు తగ్గేది కదా అని బీఆర్ఎస్ ను విమర్శించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments