Wednesday, April 16, 2025
HomeNewsTelanganaNiranjan Reddy: రేవంత్ కరెంట్ వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ అవటంతో.. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు

Niranjan Reddy: రేవంత్ కరెంట్ వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ అవటంతో.. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు

అమెరికా పర్యటనలో కరెంటు మీద చేసిన వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ కావడంతోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్ధం లేకుండా మాట్లాడుతున్నాడని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్ధాయిలో విరుచుకు పడ్డారు. అంశాలవారీగా సైద్దాంతిక ప్రాతిపదికన ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు, విమర్శించోచ్చని, సందర్భోచితంగా సహేతుకమైన విమర్శలు చేయవచ్చు అని ఆయన అన్నారు. ప్రజలు, సమాజం విజ్ఞత కలిగి ఉంటారన్న విషయం మాట్లడే ముందు గుర్తెరగాలి అని సూచించారు.

రెండో సారి ప్రజలు ఆమోదించిన ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దుర్భాషలాడడం సహేతుకం కాదన్నారు. రేవంత్ వ్యాఖ్యలు వారి పార్టీని పెంచడానికా ? తుంచడానికి ? అని వారి పార్టీ నేతలే ఆలోచిస్తున్నారని తెలిపారు.కేసీఆర్ ను విమర్శించినంత మాత్రాన రేవంత్ పెద్దవాడు అయిపోడని.. అడ్డగోలుగా మాట్లాడితే ఏదో అయిపోతానని ఆపోహా రేవంత్ కు ఉన్నట్లుంది అని మంత్రి విమర్శించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చంద్రబాబు చర్యలలో నీ పాత్ర అబద్దమా ? టీవీలలో పట్టుబడింది నిజమే కదా ? నీ చర్యలను నీ పార్టీ శ్రేణులే హర్షించడం లేదని రేవంత్ పై నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పరిమితులకు లోబడి హుందాగా మాట్లాడితే అర్ధవతంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఎంచుకున్న పనులలో ప్రాధాన్యతా క్రమంలో కొన్ని మిస్ అవుతాయి. వాటిని చేసినట్లు మేము చెప్పుకోవడం లేదన్నారు. సమయాన్ని బట్టి వాటిని పూర్తిచేస్తాం అని కూడా అన్నారు.

అభూత కల్పనలతో కూడిన ఆధారం లేని ఆరోపణలు తాత్కాలికంగా సంచలనం కావచ్చును కానీ కాలక్రమంలో అవి నిలబడవు అని అన్నారు. సచివాలయం కడితే అందులో నేలమాళిగలు ఉన్నాయని, ఎదుటివారిని నోటికొచ్చినట్లు దూషించడం పద్దతి కాదు అని, రేవంత్ భాష మార్చు కోవాలని హెచ్చరించారు.86 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తారు. ఇది సాద్యమా ? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడే తీరు ఇదేనా ? వ్యక్తులను తూలనాడడం ఇదేం పద్దతి ? ప్రతిదానికి ఓ హద్దు అనేది ఉంటుందని అన్నారు. రేవంత్ తన చర్యలు, నోటి దురుసు ద్వారా అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి బతికి ఉండగానే పిండం పెడుతున్నాడని మంత్రి తెలిపారు. ఆ పార్టీని బతికించుకోవాలి అని ఆ పార్టీ కోసం నిలబడే వాళ్లు, సీనియర్లు గమనించుకోవాలని సూచించారు.

IMG 20230809 WA0012

కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ రెడ్డి ఎన్నకల ముందు అన్నారు. ఆయనను సన్యాసం చేయమని ఎవరన్నా అడిగారా ? నువ్వే చెప్పావు. నువ్వే పాటించలేదు. నువ్వు మాట్లాడిన మాట మీద నువ్వే నిలబడలేదు. అందుకే నీ మాటలకు విలువలేదు. నీ సవాళ్లకే నీవు నిలువలేదు. అటువంటి నీతో చర్చకు రావాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు మా ప్రభుత్వంలోని వారు ఎవరూ పాల్పడలేదన్నారు. ఒక పద్దతి ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.

మీ స్థాయికి దిగజారి విమర్శించేంత దుస్థితిలో తాము లేమన్నారు. విచక్షణతో మంచి, చెడ్డలు బేరీజు వేసుకుంటున్నామని, మీ మాయలో పడి అభివృద్ది, సంక్షేమం పక్కకుపెట్టి మిగతా అంశాలను ముందేసుకునే పరిస్థితిలో లేమని క్లారిటీ తెలిపారు. ఇటువంటి వారి అసంధర్భ, దుర్మార్గపు వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వారు ఓటుతో బుద్దిచెబుతారని అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ భానుప్రసాద్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, తాతా మధు తదితరులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments