రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి (patnam mahender Reddy) గురువారం రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ (brs party working president) కల్వకుంట్ల తారక రామారావుని(ktr) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే గత కొన్ని రోజులుగా కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన కేటీఆర్ ను మంత్రి మహేందర్ రెడ్డి కేటీఆర్ నివాసంలో కలిశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కష్టానికి ప్రతిఫలంగా మహేందర్ రెడ్డికి మంచి రోజులు వచ్చాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంత్రి మహేందర్ రెడ్డితో తాండూర్ సీనియర్ నాయకుడు కర్ణం పురుషోత్తం రావుకు కూడా మంత్రిని కాలిశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు.