కాంగ్రెస్ ను నమ్ముకుంటే 24 గంటల కరంటు పోయి 3 గంటల కరంటు ఖాయంమని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. వనపర్తి బహిరంగ సభలో పాల్గొన్నఆయన ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. పాలమూరుకు వస్తున్నప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల నీటిలో తెలంగాణ వాటా 575 టీఎంసీలు కేటాయించాలని అన్నారు. జిల్లా నుండి 14 లక్షల మంది వలసపోతుంటే గతంలో ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని అన్నారు. నది పక్కన నేలలున్నా ఏ ప్రభుత్వం కూడా నీళ్లివ్వలేదన్నారు. ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీళ్లు తీసుకుపోతున్నా పట్టించుకోలేదని.. అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే హారతులిచ్చి పంపించింది దగుల్బాజీ కాంగ్రెస్ నాయకులు అని విమర్శించారు. 65 ఏళ్లలో చేయని పనిని ఐదేళ్లలో చేసి చూయించారు కేసీఆర్ అని అన్నరు. బీఅర్ఎస్ పార్టీవి స్కీములు.. కాంగ్రెస్ వి స్కాములు అని, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు.. బీఅర్ఎస్ అంటే సాగునీళ్లు అని, కాంగ్రెస్ అంటే మైగ్రేషన్.. బీఅర్ఎస్ అంటే ఇరిగేషన్ అని, కాంగ్రెస్ పార్టీవీ వారంటీ లేని గ్యారంటీలు అని, కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉన్నదని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.