సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఐఆర్ డిఎ(ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్ మెంట్ అసోసియేషన్) స్వచ్చంద సేవా సంస్థ కృషి గొప్పదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఐఆర్ డిఎ సంస్థ ప్రతినిధులు, విద్యార్థులతో కలిసి ‘ప్రకృతి మిత్ర’ లోగోను గురువారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు.
గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 450 టన్నుల వేస్ట్ పేపర్ ను సేకరించి, రీసైకిల్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు నోట్ బుక్కులను అందించాలనే లక్ష్యంతో ఐఆర్ డిఎ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమైనదని మంత్రి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో 5 జూన్ 2025 నాటికి లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్న ప్రతి ఒక్కరికి మంత్రి సురేఖ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ డిఎ సంస్థ అధ్యక్షులు శ్రీ పి. వినయ్ కుమార్, ఎం. సురేష్, మట్టా వికాస్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.