అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉగాది రోజున కుటుంబ సమేతంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోకి అడుగుపెట్టారు. మంత్రి కొండా సురేఖ-మురళీ దంపతులు, వారి కూతురు సుస్మిత పటేల్ (చిట్టక్క), అల్లుడు అభిలాష్, మనవరాలు శ్రేష్ట పటేల్, మనవడు శ్రీయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ సమేతంగా గృహ ప్రవేశ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి సురేఖ స్వహస్తాలతో దేవుడి ప్రతిమలను అలంకరించి, గడపను పూజించారు. ఈ కార్యక్రమం అనంతరం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి కొండా సురేఖ, మురళీ దంపతులు తమ మనవడు శ్రీయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ తో ముచ్చటిస్తూ, ఆడుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఎప్పటిలాగే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ తెలిపారు.