అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని గురువారం ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
దర్గాను సందర్శించిన మంత్రి జూపల్లి
షా అలీ పహిల్వాన్ దర్గాను మంత్రి జూపల్లి సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ ముస్లిం మతపెద్దలు, స్థానికులతో ముచ్చటించారు. మంత్రి వెంట నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి , ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
