ఆహార భద్రత కార్డులో కేవైసీ నిబంధనలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి పునః పరిశీలించాల్సిందిగా మంత్రి గంగుల మరోసారి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత కాంగ్రెస్ వైఫల్యాల వల్ల వలసలు పోయిన ఎంతోమంది విదేశాలు, బొంబాయి, బీవండి, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో ఉండి ప్రస్తుతం కేవైసీ కోసం తిరిగి రావాలనే ఆందోళనలో ఉన్నారని, అలాంటి వారు ఎవరు అధైర్య పడద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరి కార్డును తొలగించదని, పూర్తిగా ప్రజలకు మద్దతుగా ఉంటుందని మంత్రి అన్నారు.