ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర మేడారం సమ్మక్క-సారలమ్మల మేడారం జాతర 2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు . జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జాతర అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ముఖ్యమంత్రికి నుదుటున బొట్టు పెట్టి, సమ్మక్క తల్లి కంకణాన్ని కట్టి అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఈ మహా వేడుకను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.









