మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డిని ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో టికెట్ కన్ఫాం చేసిన అనంతరం బీఫామ్ కూడా కేసీఆర్ చేతుల మీదుగా రాజశేఖర్ రెడ్డి అందుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతా రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ గత కొన్నిరోజులుగా సర్వేలు నిర్వహించిన అనంతరం పార్టీ టికెట్ ను మర్రి రాజశేఖర్ రెడ్డికి కేటాయించింది.
