Menu

  • Home
  • తెలంగాణ
  • Manda Krishna Madiga : సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ స‌మావేశం
mandakrishna madiga cm revanth reddy

Manda Krishna Madiga : సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ స‌మావేశం

ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ను మందకృష్ణ మాదిగ అబినందించారు. మంగ‌ళ‌వారం సీఎం రేవంత్ ర‌డ్డి నివాసంలో ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పై ప‌లు అంశాల‌ను ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పలు అంశాల‌పై చ‌ర్చించారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని వివరించిన సీఎం. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

01

రేవంత్ రెడ్డి ఒక కమిట్ మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేప‌ట్టార‌ని కొనియాడారు. ప్రభుత్వానికి, సీఎంకు ఒక సోదరుడిగా తాను అండగా ఉంటానని తెలిపారు. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను మందకృష్ణ మాదిగ సీఎంకు వివరించారు. రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

03

Also Read…| జబల్‌పూర్ ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి

Share the post