తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డితో పాటు ఇతర మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని శిల్పారెడ్డి అన్నారు. నిత్యజీవితంలో ఒక భాగంగా ప్రతిరోజూ యోగా చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు @DrShilpa4Bjp గారు , ఇతర మహిళా నాయకులు..#InternationalYogaDay pic.twitter.com/qgH7SE3qBk
— BJP Telangana (@BJP4Telangana) June 21, 2024