జిహెచ్ఎంసిలో భారత రాష్ట్ర సమితి (BRS Party) ఫ్లోర్ లీడర్ ను పార్టీ నియమించింది. మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ని ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జిహెచ్ఎంసిలో ఫ్లోర్ లీడర్ గా తనను నియమించినందుకు జగదీశ్వర్ గౌడ్ పార్టీ అధిష్టానానికి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావుకి (BRS Working President KTR) ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తూ నగర ప్రజలకు అవసరమైన అంశాలను జిహెచ్ఎంసి దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు.