తెలంగాణలో ఇటీవల వరదల వల్ల కొంతమంది నిరాశ్రయులయ్యారు. చాలా వరకు రైతులు పంట పొలాల్లోని పంట నష్టపోయారు. ఈనేపథ్యంలోనే వరదబాధితులకు అండగా మేమున్నామని పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వస్తున్నాయి. తాజాగా కుమారీ ఆంటీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50వేల విరాళాన్ని అందించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆమె రూ.50 వేల చెక్కు అందించారు.