సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీపై ఊరించి.. ఊరించి.. ఏడునెలలు ఏమార్చి చేసిన దానికి “ చారాణ కోడికి..! బారాణ మసాలా…!! ” అనే సామెత గుర్తుకు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిన్న, రుణమాఫీ అయిన రైతులకన్నా, కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక, అంతులేని ఆందోళనలో ఉంటే మీకు సంబరాలు ఎందుకు? అని ప్రశ్నించారు. రైతులకు జూన్ లో వేయాల్సిన రైతుభరోసా సాయం జూలై వచ్చినా రైతుల ఖాతాలో ఇంకా వేయలేదని అన్నారు. ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్ చేశారని.. ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్ చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
సీఎం గారు…
— KTR (@KTRBRS) July 19, 2024
ఊరించి.. ఊరించి..
ఏడునెలలు ఏమార్చి చేసిన..
మీ రుణమాఫీ తీరు చూస్తే..
తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..
“ చారాణ కోడికి..! బారాణ మసాలా…!! ”
రుణమాఫీ అయిన రైతులకన్నా..
కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ
ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!
రైతుమాఫీ…