KTR: కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఎండగట్టాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకుకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిపైన వెంటనే ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రం, ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దగ్ధంతోపాటు ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించి కాాంగ్రెస్ తీరును ఎండగట్లాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ రైతు బంధు అపాలంటూ ఎలక్షన్ కమీషన్ పిర్యాదు చేసి, రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న ఈకార్యక్రమాన్ని కేవలం అక్కసుతో అపాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఇప్పటికే 11సార్లు పంట సీజన్లకు అనుగుణంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కానీ కాంగ్రెస్ ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతులకు సహాయం అపాలని ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇలా కోడ్ పేరుచెప్పి ప్రభుత్వం అందిస్తున్న ఇంటింటికి మంచినీళ్లు …ఇరవై నాలుగు గంటల కరెంటును కూడా ఆపెయ్యమంటరా అని ప్రశ్నించారు. మరీ అన్ని సంక్షేమ పథకాల్లో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? దీంతో అన్ని పథకాలను కాంగ్రెస్ అపాలంటుందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అంటేనే… రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని, అన్నదాతల పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అన్నారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరని హెచ్చరించారు. అన్నదాతల పొట్టకొట్టే..కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరన్నారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలను ప్రజలు కట్ చేయడం పక్కా అన్నారు.

ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి… కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరన్నారు. తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారన్నారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసేలా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img