ఈనెల 27న జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్ధి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కోరారు. భువనగరిలో ఏర్పాటు చేసన గ్రాడ్యుయేట్స్ సమావేశానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ఓటు వేసే ముందు అభ్యర్ధి గుణగనాలు కూడా చూసి ఓటేయాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయంలో మేము చేసిన పనులను చెప్పుకోక, అధేవిధంగా కొన్నివర్గాలను దూరం చేసుకున్నామని.. ఈ రెండు కారణాల వల్లే ఓడిపోయామని అన్నారు. గుడులు కట్టి వాటి పేరుతో తాము ఓట్లు అడగడం లేదని.. ప్రాజెక్టులు కట్టి వాటికి దేవుళ్ల పేర్లు పెట్టామని తెలిపారు. పోటీలో ఒకవైపు విద్యావంతుడు, మరోవైపు బ్లాక్ మెయిలర్ పోటీలో ఉన్నారని.. ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకోవవాలని పట్టభద్రులను కేటీఆర్ కోరారు.