ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్ లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద భారీ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు. ఉదయమే ప్రారంభమైన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఇసకేస్తే రాలనంత జనం ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి వచ్చారు. గణనాథుల నిమజ్జనాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. మధ్యాహ్నానికల్లా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన గట్టం పూర్తి చేశారు.