Friday, March 21, 2025
HomeNewsTelanganaKCR: కోనాయపల్లి వెంకటేశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

KCR: కోనాయపల్లి వెంకటేశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

తనకిష్టదైవమైన కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. శనివారం కోనాయపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లిన సీఎం కేసీఆర్ గారికి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ఆలయం లోకి సీఎం ప్రవేశించారు. నామినేషన్(విజయ) పత్రాలను ఆలయ అర్చకులకు అందించగా మూలవిరాట్టు వద్ద పత్రాలు ఉంచి సీఎం కేసీఆర్ గోత్ర నామాలు, సంకల్పంతో పూజలు నిర్వహించారు. అర్చకులు కేసీఆర్ గారి చేతికి కంకణధారణ చేసి తీర్థ ప్రసాదాలు అందించి వేదాశిర్వచణం అందించారు.

అనంతరం ఆలయ ఆవరణలోనే వేంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మహిళలు విజయ తిలకం దిద్దారు. కేసీఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ హర్షధ్వానాలు చేశారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ విజయం తథ్యం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అత్యంత అభిమానంతో గులాబీల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీలు..జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బిఆర్ఎస్ నేత శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రధాన ముఖద్వారం దక్షిణం వైపు ఉండడం ఇక్కడి కొనాయిపల్లి దేవాలయం ప్రత్యేకత.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments