కాలు ఆపరేషన్ తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువ సేపు నడవటం లేదు. ఇన్ని రోజులు కూడా డాక్టర్ల సూచన మేరకు కర్ర సహాయంతో నడుస్తున్నాడు. తాజాగా కేసీఆర్ కారు నడుపుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేసీఆర్ డాక్టర్లే మ్యానువల్ కారు నడిపమని చెప్పారని.. డాక్టర్ల సూచనల మేరకు తన పాత ఓమ్నీ వ్యాన్ ను కేసీఆర్ స్వయంగా నడిపారని తెలుస్తుంది.